జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ఈవెంట్: మంత్రి రాజనర్సింహ

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Rajanarsimha) స్పష్టం చేశారు. జూన్‌లో ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు సచివాలయంలోని తన చాంబర్‌‌లో ఆరోగ్య, పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ను ప్రపంచ వైద్య పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలని సీఎం రేవంత్‌ సూచించారని గుర్తు చేశారు. ఇకపై ప్రతి ఏటాహైదరాబాద్‌లో కనీసం ఒక మెడికల్ టూరిజం ఈవెంట్‌ను నిర్వహించాలని సీఎం నిర్ణయించారని, ఇందుకు అనుగుణంగా జూన్‌ నెలలో మొదటి ఈవెంట్ నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈవెంట్ నిర్వాహణ కోసం పర్యాటకశాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో మెడికల్ టూరిజం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, కలిగే ప్రయోజనాలపై మంత్రి (Minister Rajanarsimha) చర్చించారు. దేశ, విదేశీ వైద్య, ఫార్మా రంగ ప్రముఖులను ఈవెంట్ లో భాగస్వాములను చేయాలని సూచించారు. మెడికల్ టూరిజంలో ఉన్న ప్రైవేటు సంస్థలను సైతం భాగస్వామ్యం చేయాలన్నారు. ఆఫ్రికా, ఏసియా, మిడిల్ ఈస్ట్‌ తదితర కంట్రీస్ నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌తో పాటు.. నిమ్స్‌, టిమ్స్‌, ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ హాస్పిటళ్ల సందర్శనకు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న మూడు టిమ్స్ హాస్పిటల్స్‌లో ఇంటర్నేషనల్ పేషెంట్ సర్వీసెస్ విభాగాలను ఏర్పాటు చేయాలనిసూచించారు. ఒక్కో హాస్పిటల్‌లో 50 బెడ్లతో ఇంటర్నేషనల్ పేషెంట్స్ వార్డు ఏర్పాటు చేయాలన్నారు.

Read Also: SIRపై దృష్టి సారించాలి.. HYD పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>