Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్‌లో టెస్లా.. ఏఐ స్పెషల్ కార్లు

కలం, వెబ్ డెస్క్: టెస్లా (Tesla).. ఈ పేరు వినగానే లగ్జరీ కార్లు వాడే సంపన్నులకు ఓ క్రేజీ.. ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని వెయిట్ చేస్తుంటారు.. ఆ టైమ్ రానే వచ్చింది. నగరంలో ఫస్ట్ టైమ్ టెస్లా కార్ ఎక్స్‌క్లూజివ్ షో రూమ్ ఓపెన్ అయింది. ‘వై ఎల్’ సిరీస్ కార్లు నగరంలోనే అందుబాటులోకి వచ్చేస్తాయి. దేశంలో ఇప్పటి వరకు నాలుగు టెస్లా షో రూమ్‌లు ఉండగా, ఐదవది హైదరాబాద్ (Hyderabad) సిటీలో ఏర్పాటైంది. ఈ సంవత్సరం లేటెస్ట్ మోడల్ కార్ల డెలివరీ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. కార్లను వెబ్‌సైట్ ద్వారానే బుక్ చేసుకోవాలి.

సంగారెడ్డి జిల్లా బొల్లారం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్రత్యేకంగా టెస్లా కార్ల కోసం గోడౌన్ రెడీ అయింది. సిటీలో (Hyderabad) విక్రయించే టెస్లా కార్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని జోడించినట్లు ఆ కంపెనీ ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ఇది ఫస్ట్ టైమ్ ఇంట్రోడ్యూస్ చేసినట్లు వివరించారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కేవలం ఐదారు సెకన్లలోనే 100 కి.మీ. పికప్ అందుకుంటుందన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఈజీగా 500 కి.మీ. వరకు ట్రావెల్ చేయొచ్చు.

టెస్లా ‘వై ఎల్’ (Tesla YL) వేరియంట్ ధర కనీసంగా రూ. 51 లక్షలు ఉంటుందని, ఫీచర్స్‌ను బట్టి ఇంకా పెరుగుతుంది. ఫస్ట్ డౌన్ పేమెంట్‌గా రసూ. 6 లక్షలు కడితే ఆ తర్వాత నెలకు రూ. 40 వేల చొప్పున ఇన్‌స్టాల్‌మెంట్లుగా చెల్లించొచ్చు. ‘వై ఎల్’ సిరీస్‌లోనే మరో మోడల్ కారు సింగిల్ ఛార్జింగ్‌తో 680 కి.మీ. ట్రావెల్ చేయొచ్చు. దీని మినిమం ప్రైస్ రూ. 62 లక్షలు. ఆరున్నర లక్షల డౌన్ పేమెంట్ కట్టి ఆ తర్వాత నెలకు రూ. 50 వేల చొప్పున ఇన్‌స్టాల్‌మెంట్ కట్టేయొచ్చు. సిటీలో టెస్లా సొంతంగా చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నది.

Read Also: వాట్సాప్ వెబ్‌లో బిగ్ అప్‌డేట్.. ఇక బ్రౌజర్ నుంచే గ్రూప్ కాల్స్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>