బాధితులకు ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే ధన్ పాల్

కలం, నిజామాబాద్ బ్యూరో: పేదలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని, అవసరమైన వారికి నిమ్స్‌లో ఎఓసీ అందజేస్తున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని సుభాష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం పలువురికి ఎమ్మెల్యే ఎల్‌ఓసీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజక వర్గంలో అర్హులైన పేదలకు ఎల్ఓసీ ఇప్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని మాలపల్లికి చెందిన అహ్మది బేగం నరాల సంబంధిత వ్యాధితో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు రూ.5 లక్షల ఎల్ఓసీ అందజేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడటమే తన కర్తవ్యం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

Read Also: విపక్షాల ఏడుపే నాకు ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>