Mobile Popup Ad
Mobile Popup Ad

రూ.2000 లోపు బెస్ట్ ఇండక్షన్ స్టౌలు ఇవే!

కలం, వెబ్ డెస్క్ : అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత్‌లోని వంటగదిపై పడింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వంట గ్యాస్ కొరత కనిపిస్తోంది. ఇళ్లకు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఉండవని చెప్పిన అధికారులు.. కమర్షియల్ సిలెండర్లపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా భారీగా దెబ్బతింది. పలు ప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్యాస్ సరఫరా పునరుద్ధరించకపోతే హోటళ్లను మూసివేస్తామని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రభుత్వం చమురు సంస్థలను ఉత్పత్తి పెంచాలని ఆదేశించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. రెస్టారెంట్లపైనే కాకుండా హాస్టళ్లపై కూడా ఈ గ్యాస్ కొరత ప్రభావం భారీగానే ఉంది. దీంతో ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్(కరెంట్ పొయ్యి)కు (Index Stoves) గిరాకీ పెరిగింది. మరి ఏ ఇండక్షన్ కొనాలి? ఎంతలో కొనాలి? అన్న సందేహాలు రావడం సహయం. అయితే కేవలం రూ.2,000 లోపు లభించే 5 బెస్ట్ ఇండక్షన్ స్టవ్స్ ఏంటో చూద్దామా..

బడ్జెట్ ధరలో నమ్మకమైన బ్రాండ్ ‘పిజియన్’ నుండి 2100 వాట్ల ఇండక్షన్ కుక్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో 1,899 రూపాయలకే లభిస్తోంది. దీని పుష్-బటన్ ఇంటర్‌ఫేస్ వాడటం చాలా సులభం. అలాగే ప్రెస్టీజ్ ఐరిస్ ఎకో 1200 వాట్ల మోడల్ అమెజాన్‌లో 1,699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఇది తక్కువ విద్యుత్తును వినియోగించుకుంటూ చిన్న కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుంది. ఇక వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుండి రక్షణ కోరుకునే వారికి ట్రిపుల్ మెటల్ ఆక్సైడ్ వెరిస్టర్(MOV) ఫీచర్ ఉన్న ఫిలిప్స్ 1300 వాట్ల మోడల్ ఇండెక్స్ స్టవ్ (Index Stoves) 1,999 రూపాయలకు లభిస్తోంది.

మరోవైపు ప్రీమియం లుక్ కావాలనుకునే వారు కెంట్ 1500 వాట్ల టచ్ ప్యానెల్ మోడల్‌ను 1,799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. అన్నిటికంటే తక్కువ ధరలో ఎక్కువ పవర్ కోరుకునే వారికి నెట్‌వుల్ 2000 వాట్ల రేడియంట్ కుక్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం 1,633 రూపాయలకే అందుబాటులో ఉంది. గ్యాస్ కొరత వేధిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇవి సామాన్యులకు మరియు చిన్న వ్యాపారులకు ఎంతో ఊరటనిస్తాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సరఫరా వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిద్దాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>