బ్లూజెట్ ఫార్మా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్

క‌లం, వెబ్ డెస్క్‌: అనకాపల్లి (Anakapalli) జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం వద్ద బ్లూజెట్ ఫార్మా (Bluejet Pharma) ఫ్యాక్టరీకి మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) నేడు శంకుస్థాపన చేశారు. మంత్రి లోకేశ్‌కు పరిశ్రమ యాజమాన్యం ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. దాదాపు రూ.2000 కోట్ల పెట్టుబ‌డుల‌తో ఈ ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సుమారు 1700 మందికి ప్ర‌త్య‌క్ష ఉపాధి ల‌భించనున్నట్లు బ్లూజెట్ సంస్థ వెల్ల‌డించింది. మంత్రి లోకేశ్‌ పర్యటనతో స్థానికంగా అధికారులు క‌ట్టుదిట్ట‌మైన‌ ఏర్పాట్లు చేశారు. నేడు మధ్యాహ్నం సీతపాలెం (Seethapalem) వద్ద ఏర్పాటు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల‌తో మంత్రి లోకేశ్‌ సమావేశం కానున్నారు. చిన్నారి పునర్విక కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు రూ.10 కోట్లు కలెక్ట్ చేసిన నేపథ్యంలో వారిని క‌లిసి అభినందించ‌నున్నారు.

Read Also: సూప‌ర్ సిక్స్‌ను సూప‌ర్ హిట్ చేశాం: సీఎం చంద్ర‌బాబు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>