వంట నూనె కూడా ఎక్స్‌పైర్ అవుతుందా? గుర్తించే లక్షణాలు ఇవే!

కలం, వెబ్‌డెస్క్: ఆరోగ్యకరమైన, రుచికరమైన జీవనశైలికి వంటగది ఒక ప్రయోగశాల అయితే, అందులో వంటనూనె (Cooking Oil) ఒక అద్భుతమైన రసాయనం. మనం ఎంత రుచిగా ఆహారం వండాలన్నా వంటనూనె తప్పనిసరి. అయితే, ప్యాక్ చేసిన ఆహార పదార్థాల లాగే మనం వాడే వంట నూనె కూడా ఎక్స్‌పైర్ అవుతుందనే విషయం మీకు తెలుసా? అవును వంట నూనెకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.

సాధారణంగా నూనె డబ్బా లేదా ప్యాకెట్ సీల్ చేసి ఉన్నంత వరకు దానిపై ఉన్న ‘బెస్ట్ బిఫోర్’ (Best Before) డేట్ ప్రకారం 1 నుండి 2 సంవత్సరాల వరకు సురక్షితంగా ఉంటుంది. కానీ, ఒకసారి నూనె సీల్ ఓపెన్ చేసిన తర్వాత, అది గాలితో (Oxygen) చర్య జరపడం ప్రారంభిస్తుంది. దీనిని ఆక్సిడేషన్ (Oxidation) అంటారు. ఫలితంగా, సీల్ తెరిచిన వంట నూనెను 6 నుండి 8 నెలల లోపు ఉపయోగించడం అత్యంత ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. అయితే ఆవనూనె (Mustard Oil) వంటివి కొంచెం ఎక్కువ కాలం పాటు పాడవకుండా ఉంటాయి. అయితే నూనె పాడైపోయిందని మనం ఎలా గుర్తించాలి. పాడైపోయిన వంటనూనెను (Cooking Oil) గుర్తించేందుకు కొన్ని లక్షణాలు చెబుతున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

నూనె పాడైపోయిందని గుర్తించడం ఎలా?

దుర్వాసన (Bad Odor)

నూనె పాడైపోతే దాని నుండి ఒక రకమైన వింతైన, రసాయన లేదా పాత నిల్వ వాసన వస్తుంది.

రంగు మారడం (Color Change)

నూనె మునుపటి కంటే చాలా డార్క్ (నల్లగా లేదా ముదురు రంగులోకి) మారినట్లు అనిపిస్తే అది పాడైందని అర్థం.

చిక్కదనం (Texture)

నూనె సాధారణం కంటే ఎక్కువ జిగటగా లేదా చిక్కగా మారడం కూడా అది చెడిపోవడానికి సంకేతం.

పాడైన నూనె వాడడం వల్ల కలిగే నష్టాలు

గడువు ముగిసిన లేదా పాడైపోయిన నూనెలో ఫ్రీ రాడికల్స్ (Free Radicals) ఏర్పడతాయి. ఇటువంటి నూనెతో చేసిన వంటలు తినడం వల్ల జీర్ణక్రియ దెబ్బతినడం, కడుపునొప్పి, ఎసిడిటీ వంటి తక్షణ సమస్యలతో పాటు దీర్ఘకాలంలో గుండె జబ్బులు, శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపులు) వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి, నూనెను ఎప్పుడూ నేరుగా ఎండ తగలకుండా, చల్లని, చీకటి ప్రదేశంలో భద్రపరచండి. వంటగదిలో చాలా కాలంగా తెరిచి ఉన్న నూనెను వాడే ముందు పై లక్షణాలను ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేసుకోండి.

Read Also: నిశ్శబ్దంగా బంధాలను దెబ్బతీస్తున్న సోషల్ మీడియా అలవాట్లు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>