Mobile Popup Ad
Mobile Popup Ad

పార్టీ జెండాలో పసుపు రంగుపై కవిత క్లారిటీ..!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండాలో పసుపు రంగు ఉండటంపై ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇంటర్వూలో భాగంగా.. రాజకీయాల్లో టీడీపీ అంటే పసుపు అనే బ్రాండ్ గా మారిందని, అలాగే మిమల్ని చంద్రబాబు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయని ఆమెను యాంకర్ ప్రశ్నించారు. దీనికి కవిత సమాధానం చెప్తూ.. పసుపు రంగు భూమి పుట్టినప్పటి నుంచి ఉందని, ఆ రంగు కేవలం టీడీపీకి చెందిందని అనడం హాస్యాస్పదం అని జవాబిచ్చారు.

పసుపు అంటే తనకు చాలా ఇష్టమని, పసుపు రంగు భూమి పుట్టినప్పటి నుంచి ఉందని చెప్పారు. నిజామాబాద్ ప్రజలకు పసుపు అనేది చాలా సెంటిమెంట్ అని, అక్కడ ఎక్కువ పండించేది పసుపేనని గుర్తు చేశారు. అలాగే ఆడబిడ్డకు పసుపు అనేది సెంటిమెంట్ అని స్పష్టం చేశారు. జీవితకాలం పసుపుకుంకుమలతో ఉండాలని ఆడబిడ్డలు కోరుకుంటారని పేర్కొన్నారు. అంతేకాదు పసుపు అంటే సమృద్ధి, వెలుతురు, అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. ఎల్లమ్మ, మల్లన్న, పెద్దమ్మ ఇలా ఏ దేవుల కోలువులోనైన పసుపు కీలక భూమిక పోషిస్తుందన్నారు. అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ సమృద్ధిగా ఉండాలని పసుపు కలర్ ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. అయితే తన వెనుక చంద్రబాబు, రేవంత్ రెడ్డి వారు ఎవరూ లేరని.. తాను స్వ‌తంత్య్రంగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు.

మరోవైపు ఎస్సీలు, శ్రామిక వార్గాలు, సామాజిక తెలంగాణ కోసం జెండాలో నీలి రంగు చేర్చినట్లు కవిత తెలిపారు. రైతులు, మైనార్టీ కమ్యూనిటీలను రిప్రెంజెంట్ చేయడానికి ఆకుపచ్చ రంగను చేర్చామని పేర్కొన్నారు. అలాగే జాగృతి నుండి రాజకీయ పార్టీని స్థాపించామని, అందుకే జెండా రంగులో జాగృతి జెండాలోని ఆకుప‌చ్చ రంగును తీసుకున్నామ‌ని తేల్చి చెప్పారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>