Mobile Popup Ad
Mobile Popup Ad

రణబాలి విడుద‌ల తేదీ ప్ర‌క‌టించిన మేక‌ర్స్!

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ కొత్త జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) జంట‌గా న‌టిస్తున్న చిత్రం రణబాలి (Ranabaali). ర‌ష్మిక‌, విజ‌య్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో సూప‌ర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. మ‌రోవైపు పెళ్లి త‌ర్వాత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో రణబాలిపై భారీ అంచ‌నాలున్నాయి. తాజాగా ఈ సినిమాపై మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. రణబాలి విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక క్యారెక్ట‌ర్స్‌ను ప‌రిచ‌యం చేస్తూ ‘మా రణబాలి, జయమ్మ’ అంటూ ఆక‌ట్టుకునే పోస్ట‌ర్‌తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

రాహుల్ సంకృత్యాన్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగే ప్రసిద్ధ నవల ‘శప్తభూమి’ ఆధారంగా తెరకెక్కుతోంది. విజ‌య్ ఇప్ప‌టికే రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో ట్యాక్సీవాలా అనే సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. విజ‌య్‌కి కొద్దికాలంగా మంచి హిట్ లేదు. పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సాధించినా హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. మ‌రి ర‌ష్మిక‌తో పెళ్లి త‌ర్వాత విడుద‌ల‌వుతున్న ఈ సినిమా (Ranabaali) విజ‌య్‌కి ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

Read Also: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన ర‌ష్మిక మంద‌న్నా!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>