గాజువాక ప్రమాదం.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి..!

కలం, వెబ్ డెస్క్ : విశాఖ జిల్లా గాజువాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై (Gajuwaka Bus Accident) మంత్రి మండిపల్లి రాంప్రసాద్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన తర్వాత కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన మంత్రి.. ఆర్టీసీ నుంచి కూడా పరిహారం అందిస్తామని చెప్పుకొచ్చారు. ఘటనపై (Gajuwaka Bus Accident) దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. కాగా, గాజువాక సమీపంలో జరిగిన ఆర్టీసీ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్ జామ్: భారీగా నిలిచిన వాహనాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>