కలం, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ యునైటెడ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదురైనా ఆర్సెనల్ (Arsenal) వెనక్కి తగ్గలేదు. టైటిల్ రేస్‌లో ఒక అడ్డంకి ఎదురైనప్పటికీ మిగతా సీజన్‌ను ధైర్యంతో ఎదుర్కొంటామని కోచ్ మికెల్ ఆర్టెటా (Mikel Arteta) స్పష్టం చేశాడు. బుధవారం జరిగే చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌పై జట్టు పూర్తి ఫోకస్ పెట్టింది.
ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ సిటీపై నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్న ఆర్సెనల్, కైరాట్ ఆల్మాటీ (Kairat Almaty) తో స్వదేశంలో తలపడనుంది. యూరప్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలు సాధించిన గన్నర్స్, ఇప్పటికే చివరి 16కు అర్హత పొందారు. దీంతో వచ్చే నెలలో జరిగే ప్లే ఆఫ్‌ల ఒత్తిడి తప్పింది. దేశీయంగా రెండు కప్ టోర్నీల్లో కూడా జట్టు ప్రయాణం కొనసాగుతోంది.
యునైటెడ్‌తో 3-2 ఓటమి ఈ సీజన్‌లో స్వదేశంలో వచ్చిన తొలి పరాజయం. ఆ మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల స్పందన చాలా బాగుందని ఆర్టెటా మీడియాకు తెలిపాడు. ఓటమి తర్వాత కూల్‌గా ఆలోచించి ముందున్న నెలలపై స్పష్టమైన దృష్టితో ముందుకు వెళ్లాలని జట్టు నిర్ణయించుకున్నట్లు వివరించాడు. నాలుగు ప్రధాన టోర్నీల్లో బలమైన స్థితిలో ఉండటం తమ కష్టానికి వచ్చిన ఫలితమని ఆటగాళ్లు భావిస్తున్నట్లు తెలిపాడు.
లివర్‌పూల్ (Liverpool), నాటింగ్హామ్ ఫారెస్ట్ (Nottingham Forest) తో డ్రాల తర్వాత వచ్చిన ఈ ఓటమి ఒత్తిడి పెంచినా భయం లేదని ఆర్సెనల్ స్పష్టం చేసింది. మిగతా నాలుగు నెలలు ఆనందంగా ఆడతామని, గెలుపుపై పూర్తి నమ్మకం ఉంచుతామని జట్టు భావిస్తుంది. ఈ ప్రయాణంలో అభిమానుల మద్దతు కీలకమని కూడా ఆర్టెటా సూచించాడు. అయితే కైరాట్ మ్యాచ్‌కు విలియమ్ సలీబా, జుర్రియన్ టింబర్ స్వల్ప గాయాలతో దూరం కానున్నారు. మికెల్ మెరినో, డెక్లాన్ రైస్ సస్పెన్షన్ కారణంగా అందుబాటులో లేరు.


