epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

మేడారం… జనసంద్రం

కలం, వరంగల్ బ్యూరో: మేడారం మహాజాతర (Meda­ram Jathara) భక్తులతో జనసంద్రంగా మారుతోంది. దట్టమైన అడవులు, కొండకోనల నడుమ జరిగేదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన ఈ జాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. జాతరకు రూ.251 కోట్లు కేటాయించింది. వన దేవతలు గద్దెపైకి రావడానికి ముందు నుంచే భారీగా భక్తులు మేడారానికి తరలివస్తున్నారు.

జంపన్న వాగులో పుణ్యస్నానాలు

ములుగు జిల్లాలోని మేడారంలో (Meda­ram Jathara) కొలువైన వనదేవతలకు రెండేళ్లకోసారి మాఘ మాసంలో జాతర జరుగుతుంది. మంత్రి సీతక్క అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే జంపన్నవాగు (Jampanna Vagu) నీటితో కళకళలాడుతోంది. జంపన్నవాగులో స్నానాలు చేస్తున్న భక్తులు, వనదేవతల్ని దర్శించుకుంటున్నారు. భక్తులు లక్షలాదిగా తరలివస్తూ బంగారంగా కొలిచే బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

Read Also: మంత్రుల ప్రోగ్రాంను బాయ్ కాట్ చేసిన స్థానిక ఎమ్మెల్యే

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>