కలం, మెదక్ బ్యూరో : అధికారుల నిర్లక్ష్యంతో చెరువుకు గండిపడి పొలాలు మునిగిపోవడం, ఇసుక మేటలు కొట్టుకువచ్చిన సంఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో జరిగింది. మల్లన్న సాగర్ (Mallanna Sagar) ప్రాజెక్టు నుండి దుబ్బాక నియోజకవర్గానికి అవసరమైన సాగునీటిని కాలువల ద్వారా నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలతో తొగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలోని బొక్కల చెరువు సమీపంలో ప్రధాన కాలువకు గండి పడింది.
దీంతో రైతుల పంట పొలాలు (Crops Damaged) నిండిపోయి భారీగా నీళ్ళు వృధాగా పోవడంతో పాటు, పెద్దయెత్తున ఇసుక మట్టి కొట్టుకొని పంట పొలాలు నిండిపోయాయి. స్థానికులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం, ముందుగా చెరువుల పరిస్థితిని పరిశీలించకుండా నీటిని వదలడం.. ఇలా అధికారుల నిర్లక్ష్యంతో ప్రధాన కాలువకు గండి పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి పారుదల అధికారులపై నిర్లక్ష్యంతోనే తమ పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయని, మునిగిన పంటకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వంను డిమాండ్ చేశారు.

Read Also: మేడారం… జనసంద్రం
Follow Us On : WhatsApp


