epaper
Monday, January 26, 2026
spot_img
epaper

మేడారంలో పాస్ ల పంచాయితీ

కలం, వరంగల్ బ్యూరో : మేడారం (Medaram) మహా జాతరకు ఒక్కరోజే మిగిలి ఉండగా వెహికల్, దర్శనం పాస్ ల పంచాయితీ షురూ అయింది. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరకు వచ్చి తల్లులను దర్శించుకునేందుకు ప్రముఖులు, మీడియా ప్రతినిధుల కోసం జిల్లా అధికార యంత్రాoగం వీవీఐపీ, వీఐపీ పాస్ లు జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో సుమారు 30 వేల వెహికల్, దర్శనం పాస్ లు ముద్రించి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలకు ఒక్కొక్కరికి కేటగిరి వారీగా వంద నుంచి 300 వరకు పాస్ లు ఇచ్చేవారు. ఒక్కో పాస్ పై ఐదుగురు దర్శనం చేసుకునేవారు. సామాన్య భక్తులు కంటే వీఐపీల తాకిడి ఎక్కువై క్యూ లైన్లను కంట్రోల్ చేయడం పోలీస్ యంత్రాంగానికి సవాల్ గా మారింది. దీంతో రాను రాను పాస్ లను తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సారి జాతరలో సౌకర్యాలు మెరుగు పరచడంతో పాస్ ల సంఖ్య ను 10 వేలకు తగ్గించినట్లు తెలిసింది. ఈ నిర్ణయం అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.

ఎమ్మెల్యే కు 5, మంత్రికి 10కి పైన..

మంత్రులకు 10 నుంచి 20, ఎమ్మెల్యేకు 5 వెహికల్, 5 దర్శనం పాస్ లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మీడియా పాస్ ల విషయంలో కూడా నిబంధనలు పెట్టడంతో మేడారం (Medaram) జాతర కవరేజ్ కోసం వెళ్లే జర్నలిస్టులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల విషయానికొస్తే కొందరు గొడవ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి సోమవారం సాయంత్రం పాస్ ల కోసం ములుగు కలెక్టరేట్ కు వెళ్లగా 30 పాస్ లు ఇవ్వడంతో ఆమె సీరియస్ అయి తీసుకోకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. అదే విధంగా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సైతం పాస్ ల విషయంలో గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కేవలం 30, 40 పాస్ లు ఇస్తే నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఏం సమాధానం చెప్పాలని ప్రభుత్వ పెద్దలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>