కలం, సినిమా: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా గ్రాండ్ గా రూపొందుతుంది. నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ సారి విజయ్ దేవరకొండ “రణబాలి” (RANABAALI) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
1878 కాలంలో బ్రిటిష్ వారు రాయలసీమ ప్రజలను చిత్ర హింసలకు గురిచేయగా వాళ్ళని ఎదిరించి పోరాడే ఒక యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటిస్తుంది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లో బ్రిటిష్ వ్యక్తిగా నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ గ్లింప్స్ చూసిన రౌడీ ఫ్యాన్స్ ఈ సారి విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ‘రణబాలి’ గ్లింప్స్ నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
Read Also: హెలికాప్టర్ గిఫ్ట్ ఇస్తా అంటున్న మెగాస్టార్
Follow Us On: Sharechat

