కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ (Maoist Party) పూర్తిగా అంతమైపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ప్రకటించారు. ఇక నుంచి సైబర్ క్రైమ్, గంజాయి నివారణపై దృష్టి సారించే కొత్త పోలీస్ విధానం వచ్చేస్తోందని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అధునాతన హంగులతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతేలతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ మరింత బలోపేతం..
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక హంగులతో, కార్పొరేట్ కార్యాలయాలను తలపించేలా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) వివరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఈ నూతన భవనాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. అనంతరం, డీజీపీ వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీకి వేద పండితుల ఆశీర్వచనాలు పలికారు.
Read Also: చదరంగంలో ఆరవ్ సంచలనం.. 12 ఏళ్లకే ఫైడ్ మాస్టర్‌గా రికార్డు!
Follow Us On: Instagram

