Mobile Popup Ad
Mobile Popup Ad

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు హైకోర్టులో ఊరట

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట దక్కింది. మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహణ సందర్భంగా వీరిపై పలు కేసులు నమోదయ్యారు. ఈ కేసులపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్ రావులపై ఉన్న అభియోగాలను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ క్రిమినల్ కేసుల నుంచి విముక్తి లభించడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా తమపై 2011లో నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ కేసీఆర్ (KCR), కేటీఆర్‌ (KTR), హరీశ్‌రావు (Harish Rao) ఇదివరకే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్యాంక్ బండ్ పై జరిగిన మిలియన్ మార్చ్ ఉద్రిక్తతల్లో వీరిని నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పలుసార్లు తీర్పు వాయిదా వేస్తూ వచ్చింది. తాజాగా విచారణలో వీరికి సంబంధం లేదని కోర్టు తేల్చింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసులను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

Read Also: ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు.. ఆ డిమాండ్స్ కి గ్రీన్ సిగ్నల్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>