కార్పొ’రేట్’ వైద్యం.. తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రైవేట్‌, కార్పొరేట్ ఆస్పత్రులు (Private Hospitals) వైద్యం పేరుతో దోచుకుంటున్నాయి. ఒక్కసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే జేబులు గుల్ల కావాల్సిందే.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. అప్పులు చేయాల్సిందే. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో ప్రైవేట్, కార్పొరేట్ వైద్యం ఖరీదైన వ్యవహారం. శవానికి కూడా ట్రీట్‌మెంట్ చేసే ఘనత తెలంగాణలోని ఆస్పత్రులకే దక్కింది.

ఏ చిన్న కారణంతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరినా యావరేజ్‌గా దాదాపు రూ.73 వేలు ఖర్చవుతున్నది. అదే ట్రీట్‌మెంట్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుమారు రూ.6 వేల బిల్లు అవుతున్నది. అంటే ప్రభుత్వాస్పత్రులతో పోలిస్తే దాదాపు 12 రెట్లు ఎక్కువ. ఇక దేశవ్యాప్తంగా హాస్పిటలైజేషన్ బిల్ సగటున రూ.37,858. దీనితో పోలిస్తే తెలంగాణలో సుమారు 55% ఎక్కువ.

ఆరోగ్య రంగంపై దేశవ్యాప్తంగా సర్వే చేపట్టిన కేంద్రం.. తెలంగాణలోని పరిస్థితులను కళ్లకు కట్టింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్‌కు సగటున ఎంత ఖర్చవుతున్నదో లెక్కగట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత తెలంగాణలోనే ఎక్కువ దోపిడీ జరుగుతున్నదని సర్వే స్పష్టం చేసింది. దేశ ఆరోగ్య రంగానికి సంబంధించి నేషనల్ శాంపిల్ సర్వేలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. వాటన్నింటిపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

Private Hospitals
Private Hospitals

Read Also: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నేడు మరోసారి చర్చ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>