కలం మెదక్ బ్యూరో : సిద్ధిపేట (Siddipet) జిల్లా మద్దూర్ మండలం నరసయపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బావ, బావమరుదుల మధ్య చెలరేగిన గొడవ హత్యాయత్నం వరకు వెళ్లింది. పెద్దమ్మ పండుగలో బావ శివకృష్ణ బావ మరిది కరుణాకర్ మధ్య జరిగిన కొడవలో కరుణాకర్ పై శివకృష్ణ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన భార్య శిరీషపై సైతం దాడి చేశాడు. గాయపడిన వారిని కుటుంబ సభ్యులు సిద్ధిపేటలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.
Read Also: శంకర్ గౌడ్ మృతి అత్యంత బాధాకరం: అద్దంకి దయాకర్
Follow Us On : WhatsApp

