Mobile Popup Ad
Mobile Popup Ad

అక్రమార్కుల గుండెల్లో.. హైడ్రా హడల్​

కలం, సెంట్రల్ డెస్క్: హైడ్రా (HYDRAA).. గత కొంత కాలంగా హైదరాబాద్‌‌లో ఈ పేరు మార్మోగిపోతున్నది.. తరచూ వార్తల్లో నిలుస్తున్నది. ఓవైపు ప్రశంసలు పొందుతున్నది.. మరోవైపు విమర్శలు మూటగట్టుకుంటున్నది. ఎన్నో ఏండ్లుగా కబ్జాదారుల కబంధ హస్తాల్లో బందీ అయిన ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులకు హైడ్రా విముక్తి కల్పిస్తున్నది. ఆక్రమణలు తొలగిస్తూ వాటి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నది. రాజకీయ నాయకుల అండదండలతో బడా బాబులు సాగిస్తున్న కబ్జాలను అడ్డుకుంటున్నది.

చెరువుల ఎఫ్‌‌టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూములు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూడా హైడ్రా తొలగిస్తున్నదన్న వాదన ఉన్నది. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేతలు చేపట్టడంపై వ్యతిరేకత వస్తున్నది. హైడ్రా తీరుపై హైకోర్టు కూడా పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూములు, చెరువులను చెరబట్టారని.. పార్కులు, నాలాలు, రోడ్లు, ఫుట్‌‌పాత్‌‌లనూ కబ్జా చేశారని.. ఈ ఆక్రమణలన్నీ తొలగించేందుకే హైడ్రా ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ‘హైడ్రా అంటే పేదల ఇండ్లు కూల్చడమేనా? మూసీ వెంబడి 10 వేల మంది పేదల ఇళ్లు కూలగొట్టడం ధర్మమేనా? మేం అధికారంలోకి రాగానే హైడ్రాను పీకి చెరువులో పడేస్తాం’ అని కేసీఆర్ అంటున్నారు.

అసలు హైడ్రా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూములు కాపాడింది? ఎక్కడెక్కడ ఆక్రమణలు తొలగించింది? చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలను తొలగించిందా? ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల ఆస్తులు తిరిగి వచ్చాయి? తదితర అంశాలపై కలం 360 డిగ్రీస్ ప్రత్యేక కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి.

HYDRAA
HYDRAA

Read Also: లీగల్ బ్యాటిల్ టు స్ట్రీట్ ఫైట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ స్ట్రాటెజీ…

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>