Mobile Popup Ad
Mobile Popup Ad

మెదక్ జిల్లాలో వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు: కలెక్టర్ ప్రతిమా సింగ్

కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు (Indiramma Indlu) వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 750 ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యాయని, 650 ఇండ్లు ప్రారంభమయ్యాయన్నారు. మిగిలిన అభ్యర్థులు కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. పేదల సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ తెలిపారు. 99 రోజుల సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో భారీగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణం పక్కాగా పారదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఇందిరమ్మల నిర్మాణం కోసం ప్రభుత్వం విడతలవారీగా నిధులు విడుదల చేస్తున్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి ఐదు లక్షలు అందించామన్నారు. అనంతరం శివాయపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు తోట లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీవో రమాదేవి, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, హౌసింగ్ పీడీ మాణిక్యం, సర్పంచ్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: ఐపీఎస్ అధికారుల బదిలీలు.. సుమతికి కీలక పోస్ట్!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>