Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్టీసీ కార్మికులకు వెంటనే న్యాయం చేయాలి: వీహెచ్

కలం, వెబ్ డెస్క్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్య బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (Hanumantha Rao) ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని తాను నిరంతరం పోరాటం చేశానని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూలంగా ఉండాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు వారికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల్లో భరోసా నింపాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

Read Also: బెంగాల్ లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>