Mobile Popup Ad
Mobile Popup Ad

మహనీయుల బాటలో సాగాలి : ఇటికాల పురుషోత్తం

కలం, నల్లగొండ : మహనీయుల పోరాటాల బాటలో ముందుకు సాగాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం తెలిపారు. నల్లగొండ (Nalgonda) మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, తెలంగాణ ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్, ప్రొఫెసర్ మహమ్మద్ అబ్దుల్ మాలిక్ హాజరై త్యాగధనుల సేవలను కొనియాడుతూ విద్యార్థులకు కర్తవ్య బోధ చేశారు. ఇటికాల పురుషోత్తం తన ప్రసంగంలో విద్య ద్వారా సంక్లిష్టతలకు సమాధానాలు, సన్మార్గానికి, సామరస్యతలకు బాటలు వేస్తుందన్నారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని విద్యను సాధనంగా భావించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాంక్షించారు. విద్య ద్వారా పరిపూర్ణమైన మార్పుతో పాటు ప్రపంచాన్ని పరిచయం చేసి ముందుకు నడిపించే సాధనంగా కీర్తించారు. సదాశయంతో మంచి దృక్పథంతో ప్రణాళికతో విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరని అనడానికి మహనీయుల జీవితాలే సాక్ష్యం అన్నారు. వారి అడుగుజాడల్లో పయనించి దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని సూచించారు. ఆర్టీఐ కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ.. జీవితంలోని సవాళ్లను స్వీకరించి, నైరాశ్యానికి తావు లేకుండా అంచలంచెలుగా తమను తాము మలుచుకొని కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన పూలే, అంబేడ్కర్ మహనీయుల జీవితాలు ఆదర్శమన్నారు.

అనంతరం ప్రోఫెస‌ర్‌ అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ.. మహనీయుల రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులను తీర్చేదిద్దాయని సత్యశోధనకు అధ్యయనమే ఏకైక మార్గమని, ఈ రెండేళ్ల కాలంలో విద్యార్థులు జ్ఞానార్జన వైపు దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కళాకారుడు రేలారే ప్రసాద్ తన పాట మాటతో విద్యార్థులను అలరించారు. అనంతరం విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్‌ కొప్పుల అంజిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రొఫెస‌ర్లు సరిత, అలువాల రవి, రవితేజ, వసంత, అరుణప్రియ, ప్రేమ్ సాగర్, మద్దిలేటి, జ్యోతి, సబీనా హెరాల్డ్, హరీష్ కుమార్, దోమల రమేష్, మిరియాల రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also: చదరంగంలో ఆరవ్ సంచలనం.. 12 ఏళ్లకే ఫైడ్ మాస్టర్‌గా రికార్డు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>