కలం, వెబ్ డెస్క్: ఆప్ (AAP) పార్టీకి రాజ్యసభలో (Rajya Sabha) కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి 10 మంది ఎంపీలు ఉండగా.. వీరిలో ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏదేని ఒక పార్టీ 2/3 వంతు ఎంపీలు మరో పక్షంలో చేరితే, ఆ పార్టీ రాజ్యసభా పక్షం పూర్తిగా విలీనమైనట్లువుతుంది. ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు ఆ పార్టీ తిరుగుబాటు ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు స్పష్టమవుతోంది.
పెద్దల సభలో పడిపోయిన కేజ్రీవాల్ బలం..
ఆప్ (AAP) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కు రాజ్యసభలో ముందు నుంచి కలిసి రావడం లేదు. గతంలో స్వాతి మలివాల్ పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ పనిచేస్తుండటంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించడం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో రాఘవ్ చద్ధా అదే వరుసలో చేరిపోయారు. దీంతో ఇటీవలే ఆయన్ను రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించి.. ఆ స్థానంలో మరో ఎంపీ అశోక్ మిట్టల్ ను పార్టీ నాయకత్వం నియమించింది. అయితే ఇప్పుడు మిట్టల్ సైతం రాఘవ్ చద్ధాతో కలిసి బీజేపీలో చేరబోతుండటం గమనార్హం. వీరితో పాటు సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, రాజేందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ కమలం గూటికి చేరబోతున్నారు. ఇక కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఆ పార్టీకి మిగిలారు.
Read Also: ఇరాన్ రాజకీయాల్లో సంచలనం.. ఆర్మీ చేతుల్లోకి దేశ పాలన!
Follow Us On: Sharechat

