కలం, డెస్క్: 2001 సంవత్సరంలో రికార్డులు తిరగరాసిన ‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve)lమూవీ మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో, ఆర్పీ పట్నాయక్ సంగీత సారథ్యంలో ఉదయ్ కిరణ్, (Uday Kiran) రీమాసేన్ జంటగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ.. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రీరిలీజ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ షేర్ చేశారు. 2014లో ఉదయ్ కిరణ్ అర్దాంతరంగా తనువు చాలించాడు. ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో లవర్ బాయ్ గా నిలిచే ఉన్నాడు. మళ్లీ తన సినిమా థియేటర్లకు వస్తుండటంతో ఫ్యాన్స్ కు ఫుల్ హ్యాపీ.
Read Also: బాలయ్య, మలినేని సినిమా సెట్ అయిందా..?
Follow Us On: Instagram


