కలం, సినిమా : నట సింహం నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పీడు మామూలుగా లేదు.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2.. ఇలా వరుసగా విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకున్న బాలయ్య.. నెక్ట్స్ మలినేని గోపీచంద్ (Gopichand Malineni) తో భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని అనౌన్స్ చేశారు కానీ.. ఇంత వరకు పట్టాలెక్కించ లేదు. కారణం.. కథలో మార్పులు చేర్పులు చేస్తుండడమే అని వార్తలు వచ్చాయి. ఇంతకీ.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్ ఏంటి..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మలినేని గోపీచంద్.. ఈ ఇద్దరూ కలిసి వీరసింహారెడ్డి అనే సినిమా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. దీంతో కలిసి మరో సినిమా చేయాలి అనుకున్నారు. ఇప్పుడు ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యింది. అయితే.. ముందుగా ఈ కాంబోలో హిస్టరికల్ మూవీని చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేయడం.. ఆ కథ బాలయ్యకు చెబితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగింది కానీ.. బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో కథను మార్చాలని డిసైడ్ అయ్యారు.
గత కొన్ని రోజులుగా కొత్త కథ పై మలినేని గోపీచంద్ కసరత్తు చేశారు. ఇప్పుడు స్టోరీ లాక్ అయ్యిందని.. అప్ డేట్ బయటకు వచ్చింది. బాలయ్య (Balakrishna)ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా.. చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారట. ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఇటీవల మలినేని గోపీచంద్ ఇచ్చిన ఫైనల్ నెరేషన్ కి బాలయ్య ఫిదా అయ్యారని.. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా అంతకు మించి అనేలా ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మరి.. బాలయ్య, మలినేని కలిసి ఈసారి ఏ తరహా మూవీని అందిస్తారో.. ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Read Also: వాలెంటైన్స్ డేకి ‘మనసంతా నువ్వే..’
Follow Us On: Instagram


