కలం, డెస్క్ : సోషల్ మీడియాపై అనేక దేశాల్లో తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫ్రాన్స్ (France) కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఫ్రాన్స్ లో 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టు ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై ఫ్రాన్స్ (France) లోని దిగువ సభలోని శాసనసభ్యులు మద్దతు తెలిపారు. సెనెట్ లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.
పిల్లలు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడపడం వల్ల వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని.. వారి ప్రవర్తనలో మార్పులు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ తెలిపారు. తమ దేశ భవిష్యత్ తరాలు ఫిజికల్ గా, మెంటల్ గా మరింత ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు ఇమాన్యుయేల్.


