కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో పెట్టుబడులకు సేఫ్టీ లేకుండా పోతుందనే భావన అందరిలోనూ ఉంది. సేఫ్టీ పెట్టుబడితో మంచి రాబడి పొందాలి అనుకునే వారికి ఎల్ ఐసీలో మంచి పాలసీ (LIC policy) ఉంది. పైగా ఇది మీ పిల్లల భవిష్యత్తుకు మంచి భరోసా ఇస్తుంది. పిల్లల చదువు, లేదా పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్ చేయాలి అనుకునే వారికి ఇదో మంచి ఆప్షన్. అదే ఎల్ ఐసీ అందించే న్యూ చిల్ట్రన్ మనీ బ్యాక్ ప్లాన్. ఇందులో రోజుకు రూ.150 పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు రూ.19 లక్షలకు పైగా మీ సొంతం అవుతుంది.
ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్ ప్లాన్. మీ పిల్లల పేరు మీదనే దీన్ని స్టార్ట్ చేయాలి. మీ పిల్లల వయసు 12 ఏళ్ల లోపు ఉన్నప్పుడే ఎల్ ఐసీలో ఈ పాలసీని (LIC policy) ఓపెన్ చేయాలి. ఇందులో కనిష్టంగా రోజుకు రూ.150 డిపాజిట్ చేయాలి. అంటే నెలకు రూ.4500 అవుతుంది. మీ డబ్బు ఏడాదికి రూ.55వేల దాకా పెరుగుతుంది. ఇలా మీరు 25 ఏళ్ల దాకా కొనసాగిస్తే మీ మొత్తం 1.4 మిలియన్లకు చేరుకుంటుంది. బోనస్ లు, మెచ్యూరిటీ మీ మొత్తానికి యాడ్ చేస్తే రూ.1.9 మిలియన్లు అంటే 19 లక్షలకు చేరుకుంటుంది.
ఇందులో రోజువారీ లేదా నెలకోసారి లేదంటే మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి కూడా చెల్లించవచ్చు. మీ పిల్లలకు 18 లేదా 20, 22 ఏళ్లు వచ్చినప్పుడు ఇందులో కొంత మొత్తాన్ని మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. 25 ఏళ్ల దాకా మీరు ఈ పాలసీని కొనసాగిస్తే మీకు 40 శాతం బోనస్ తో మీ పెట్టుబడి మొత్తాన్ని ఎల్ ఐసీ సంస్థ చెల్లిస్తుంది.
Read Also: పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సీఎం రేవంత్ సన్మానం
Follow Us On: Sharechat


