epaper
Friday, January 23, 2026
spot_img
epaper

అధికారులను నేనే ఎదురు ప్రశ్నించా: సిట్ విచారణ అనంతరం కేటీఆర్

కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం లీకుల ప్రభుత్వం అంటూ కేటీఆర్ (KTR) విమర్శించారు. సిట్ అధికారులను తానే కొన్ని ప్రశ్నలు వేశానంటూ పేర్కొన్నారు. తనను విచారిస్తుండగా కొన్ని తప్పుడు కథనాలు మీడియాలో వచ్చాయని కేటీఆర్ మండిపడ్డారు. గతంలో హరీశ్ రావు మీద కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం తెలంగాణ‌భవన్‌కు చేరుకున్న కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సిట్ అధికారులు ప్రభుత్వ అస్మదీయ మీడియాకు తప్పుడు లీకులు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ లీకులను ఎవరూ పట్టించుకోవద్దన్నారు. తనతో మాజీ అధికారి రాధాకిషన్ రావు ఉన్నట్టు.. ఇద్దరినీ కలిపి విచారించినట్టు మీడియాతో ప్రసారం అయ్యింది అంతా అవాస్తవమని పేర్కొన్నారు. సిట్ అధికారులు తనను అడిగిందే అడిగి కాలయాపన చేశారని.. ఈ విచారణ మొత్తం టీవీ సీరియల్‌లా కొనసాగుతోందని చెప్పారు.

‘బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? లేదా? అని సిట్ అధికారులను నేను సూటిగా ప్రశ్నించాను. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా? లేదా? అని అడిగాను. అక్కడ విషయం ఏమీ లేదు. కేవలం టైమ్ పాస్ కోసం ఈ విచారణ నడుపుతున్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా నేను సహకరిస్తాను‘ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

‘రెవెన్యూ మంత్రి కొడుకు మీద సిట్ ఎందుకు వేయలేదు? ప్రజల సొమ్మును కొల్లగొడుతుంటూ  కాంగ్రెస్ నేతల మీద సిట్ ఎందుకు వేయలేదు.  ముఖ్యమంత్రి బావమరిది కింగ్ పిన్ అని ఆరోపణలు ఉన్నా సిట్ వేయలేదు.’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలి కదా అంటూ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. ప్రభుత్వం నా మీద తప్పుడు ప్రాచం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.

 Read Also: ఎక్స్‌క్లూజివ్ : కేటీఆర్‌ను సిట్ అడిగిన ప్రశ్నలు ఇవే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>