కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఆరోపించారు. గురువారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజన మీద రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి కొత్త జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల కార్పొరేషన్ ఎన్నికలు తప్పించుకోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ లోని అన్ని మున్సిపాలిటీల్లో మంచి విజయం సాధిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: నిజామాబాద్ మున్సి‘పోల్స్’పై ఉత్తమ్ ఫోకస్.. నేతలకు కీలక ఆదేశాలు
Follow Us On: Youtube


