చిన్నారి ప్రాణం తీసిన వారిని కాపాడొద్దు : కేటీఆర్

కలం, డెస్క్ : నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని కుమ్మెర ఘటన అత్యంత దారుణం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). జిల్లాలోని అంబేడ్కర్ సెంటర్ దగ్గర కుమ్మెర గ్రామస్తులు చేపట్టిన ధర్నాకు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. పసిగుడ్డుకు ఏం తెలుసని చంపేశారని మండిపడ్డారు. 2 నెలల చిన్నారికి కులం తెలుసా.. మతం తెలుసా.. ఏం అడిగిందని చంపేశారు. ఈ రోజుల్లో కూడా కులం పేరిట దాడులు జరగడం అత్యంత బాధాకరం’ అంటూ కేటీఆర్ తెలిపారు.

ఈ ఘటనకు కారణమైన 8 మందిని విడిచిపెట్టొద్దని.. ఏ పార్టీ వాళ్లైనా సరే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్ (KTR). నిందితులను కాపాడాలని చూడటం అత్యంత హేయమైన చర్య అని ఖండించారు. బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read Also: మాకేది గ్రౌండ్.. నిజామాబాద్‌లో జూడాల నిరసన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>