ఖమ్మంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగింపు.. వీహెచ్ నిరసన

క‌లం, వెబ్ డెస్క్: ఖమ్మం (Khammam) నగరంలోని కాల్వ ఒడ్డున ఉన్న రాజీవ్ గాంధీ విగ్ర‌హం తొల‌గింపు ఆందోళ‌న‌కు దారి తీసింది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత రావు (V Hanumantha Rao) ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆదివారం విగ్ర‌హం తొల‌గించిన చోట నిర‌స‌న‌కు దిగారు. దేశం కోసం ఎంతో సేవ చేసిన మ‌హ‌నీయుడు రాజీవ్ గాంధీ అని, ఆయ‌న‌ విగ్రహాన్ని తొలగించడం అత్యంత దారుణమని మండిప‌డ్డారు. తక్షణమే అదే స్థానంలో విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ అధికారుల తీరుపై గ‌ట్టిగా నిలదీశారు. విగ్రహం ఏర్పాటు చేసే వరకు తన పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు. వీహెచ్‌తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కులు ఈ నిర‌స‌న‌లో పాల్గొన్నారు. దీంతో అధికారులు ఏం చేస్తార‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>