మాకేది గ్రౌండ్.. నిజామాబాద్‌లో జూడాల నిరసన

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ప్రభుత్వ మెడికల్ కాలేజీ (Medical College)కి శాశ్వత కాలేజీ గ్రౌండ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్థులు నిరసన తెలిపారు. హాస్పిటల్ ఓపీ గేట్ వద్ద సమావేశమై మీడియానుద్దేశించి మాట్లాడారు. కాలేజీ స్థాపించి 13 సంవత్సరాలు పూర్తయ్యినప్పటికీ, ఇప్పటివరకు గ్రౌండ్ కేటాయించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కాలేజీ గ్రౌండ్ లేకపోవడంతో విద్యా, క్రీడా వ్యక్తిత్వాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ విద్య అనేది ఒత్తిడితో కూడిన కోర్సు అని, క్రీడా మైదానం లేక మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి శాశ్వత కాలేజీ గ్రౌండ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్స్ హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్, జనరల్ సెక్రటరీ డా. జయంత్, వైస్ ప్రెసిడెంట్ డా. సంతోశ్, అడ్వైజరీ కమిటీ డా.చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీలు డా. వక్వార్, డా.హేమంత్, డా. రవి రాథోడ్‌ పాల్గొన్నారు.

Read Also: మణుగూరులో అదుపు తప్పి చెట్టుని గుద్దిన ట్రాక్టర్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>