కలం, మెదక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎర్రవెల్లిలోని కేసీఆర్ (KCR) ఫామ్ హౌస్‌కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ వెనుక గేటు నుంచి కేటీఆర్ లోపలికి వెళ్లినట్లు సమాచారం. ఇంతకు ముందే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఫామ్ హౌస్‌కు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కేసీఆర్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విచారణకు రావాలని సిట్ కేసీఆర్‌ను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ సిట్‌కు లేఖ రాశారు. దీంతో సిట్ ఈ రోజు మళ్లీ కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వనుందని తెలుస్తోంది. ఈ అంశంపైనే కేటీఆర్, జగదీశ్ రెడ్డితో కేసీఆర్ చర్చించనున్నారు.


