కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉగాది (Ugadi) పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ నోట్ రిలీజ్ చేశారు. భారతీయ పండుగలు అర్థం, పరమార్థాలతో నిండినవని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేమానురాగాలు, ప్రకృతి ఆరాధన కలగలసిన విశిష్టత మన పండుగలలో కనిపిస్తుందని తెలిపారు. తెలుగువారికి తొలి పండుగగా ఉగాది అత్యంత ప్రాముఖ్యమైనది.
వసంత ఋతువు ఆగమనంతో వచ్చే ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారని తెలిపారు. మహారాష్ట్రలో “గుడి పాడ్వా”, కర్ణాటకలో “యుగాది”, సింధీ సమాజంలో “చెటి చంద్”, కాశ్మీరీ పండితులు “నవ్రెహ్”, మణిపూర్‌లో “సజిబు నోంగ్మా పాన్‌బా”గా ఈ పండుగను నిర్వహిస్తారని తెలిపారు.
ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరంగా ఉగాది (Ugadi) మన ముందుకు వస్తోందని, “పరాభవో న జ్ఞాతవ్యః” అనే పెద్దల మాటను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పరాభవానికి దారి తీసే పనులు చేయకూడదని ఆయన సందేశంలో పేర్కొన్నారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు తీసుకురావాలని.. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలిపారు.

