పండుగల వేళ యూపీ సీఎం యోగి వార్నింగ్..

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో శాంతిభద్రతలకు, మత సామరస్యానికి ఎలాంటి భంగం కలిగించవద్దని ఉత్తరప్రదేశ్ (Uttara Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. గురువారం ప్రారంభమయ్యే చైత్ర నవరాత్రులు, మార్చి 20న జరిగే అల్విదా నమాజ్, మార్చి 21న జరిగే ఈద్ అల్-ఫితర్ కోసం జరుగుతున్న విస్తృత ఏర్పాట్లను సీఎం యోగి
సమీక్షించారు. పండుగల సమయంలో ప్రజల క్రమశిక్షణా రాహిత్యాన్ని, వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోమన్నారు.

అలాంటి ఘటనలకు బాధ్యులైన వారిపై ఏమాత్రం కనికరం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు అన్ని విధాలా శాంతి, భద్రత, క్రమశిక్షణ ఉండేలా చూడాలని, ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మతపరమైన కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలోనే జరగాలని, కొత్త సంప్రదాయాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రం (Uttara Pradesh)లో శాంతియుత వాతావరణం ఉండేలా చూసేందుకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ కెప్టెన్లు సున్నితత్వంతో, సమన్వయంతో పనిచేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>