epaper
Friday, January 30, 2026
spot_img
epaper

శబరిమల గోల్డ్​ స్కామ్​.. యాక్టర్​ జయరామ్​ను ప్రశ్నించిన సిట్​ ​

కలం, వెబ్​డెస్క్: శబరిమల గోల్డ్​ స్కామ్​ (Sabarimala Gold Scam) కేసులో మరో ఆసక్తికరణ పరిణామం. ఈ కేసులో యాక్టర్​ జయరామ్​ను సిట్​ అధికారులు విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నైలోని జయరామ్​ స్వగృహంలో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితో గల సంబంధాలపై వివరాలు రాబట్టారు.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని బంగారు తాపడాలను మరమ్మతు కోసం చెన్నైకి తీసుకొచ్చిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్​ పొట్టి.. జయరామ్​ స్వగృహంలో జరిగిన పూజల్లో ఆ తాపడాలను వాడినట్లు ఇటీవల ఓ వీడియో బయపటపడింది. దీంతో ఈ కేసులో సిట్​ జయరామ్​ను విచారించినట్లు తెలుస్తోంది.

కాగా, శబరిమల అయ్యప్ప స్వామి గర్భగుడిలోని బంగారు తాపడాలను మరమ్మతుల కోసమంటూ ఉన్నికృష్ణన్​ పొట్టి 2019లో చెన్నైలోని ఓ కంపెనీకి అప్పగించారు. అనంతరం తిరిగి వాటిని ఆలయానికి తీసుకెళ్లారు. అయితే, మరమ్మతులకు తీసుకెళ్లి, తెచ్చాక వాటి బరువులో సుమారు 4కిలోల మేర తగ్గినట్లు ఆలయ అధికారులు గుర్తించి కేసు పెట్టారు (Sabarimala Gold Scam). ఇది కేరళలో సంచనలంగా మారింది.

ఈ కేసులో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కేరళ హైకోర్టు సిట్​ను​ నియమించింది. ఇప్పటివరకు ఈ కేసులో సిట్​ అధికారులు ప్రధాన నిందితునితోపాటు ఆలయ పూజారిని, మరో 14 మందిని అరెస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>