కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ఒక సీఎం అయి ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని.. అసెంబ్లీలో సభా మర్యాదలు లేకుండా బూతులు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ మానసిక పరిస్థితిపై తమకు అనుమానం ఉందని.. తనను కాపాడుకోవడానికి సీఎం ఇలా బూతులు మాట్లాడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇలాంటి బూతుల పట్ల కచ్చితంగా ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందించాలని కేటీఆర్ చెప్పారు.
స్పీకర్ కు ఏ మాత్రం ఇంకితం ఉన్నా సీఎం రేవంత్ చేసిన కామెంట్లను రికార్డుల నుంచి తొలగించాలంటూ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. తాము ప్రశ్నిస్తుంటే వాటిపై సమాధానాలు ఇవ్వకుండా ఇలా బూతులు తిట్టి డైవర్ట్ చేస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. శ్రీధర్ బాబు, ఉత్తమ్, దామోదరను తొక్కుకుంటూ రేవంత్ సీఎం అయ్యారని కేటీఆర్ సెటైర్లు వేశారు. రేవంత్ కు కేరళ ఎన్నికల కోసం డబ్బుల టార్గెట్ పెట్టారేమో.. అందుకే మూసీ పేరుతో స్కామ్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

