epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

రేపో.. ఎల్లుండో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్

కలం, నల్లగొండ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నోటిఫికేషన్ రేపో, ఎల్లుండో వస్తుంది. నేటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah), మంత్రి వెంకటరెడ్డి (Venkat Reddy) కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరహాలో యాదగిరిగుట్ట బోర్డును (Yadagirigutta Board) ఏర్పాటు చేయనున్నామని అన్నారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బోర్డు ఏర్పాటు విషయమై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తో చర్చించామని, అన్ని సాంప్రదాయాలను పాటిస్తూ డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు. ఆటోలను గుట్ట పైకి అనుమతించడంతో పాటుగా భక్తులు రాత్రి నిద్ర చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో బీర్ల ఐలయ్య  ప్రభుత్వ విప్ గా, ఎమ్మెల్యేగా, డిసిసి అధ్యక్షుడిగా మూడు పదవులను నిర్వహిస్తున్నారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>