కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో లోన్లు కట్టడానికి ఏళ్లకు ఏళ్లు గడిచిపోతోంది. హోమ్ లోన్ లాంటిది లేదా ఇతర దీర్ఘకాలిక లోన్ తీసుకుంటే.. జీవితంలో సగం ఆ లోన్లు కట్టడానికే సరిపోతుందని చాలా మంది బాధపడుతుంటారు. అయితే 3 టిప్స్ పాటిస్తే లోన్ (Loan) ను త్వరగా కట్టేయొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియక ఏళ్లకు ఏళ్లు ఈఎంలు కట్టేస్తూ గడిపేస్తారు. లోన్ చివరి ఈఎంఐ దాకా కడితే అసలు కంటే వడ్డీయే ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కేవలం హోమ్ లోన్లే కాకుండా క్రెడిట్ కార్డుల లోన్లు, పర్సనల్ లోన్లు కూడా ఈ మధ్య దీర్ఘకాలికంగానే ఉంటున్నాయి. మీ లోన్ ను తగ్గించే మూడు టిప్స్ ను ఒకసారి చూద్దాం.
లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్..
ఈ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అంటే.. లోన్లను ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకు మార్చుకోవడం. ఉదాహరణకు మీరు ఒక బ్యాంకులో అర్జెంటుగా ఒక లోన్ తీసుకున్నారు. కానీ అందులో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే.. తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకులోకి అదే లోన్ (Loan) ను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. దీన్నే లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్ ఫర్ అంటారు. లోన్ తీసుకున్న రెండేళ్ల లోపే ఇలా ట్రాన్స్ ఫర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే లోన్ తీసుకున్న మొదటి రెండు లేదా మూడేళ్లలోనే మనం కట్టే ఈఎంఐలో ఎక్కువ భాగం వడ్డీకి వెళ్తుంది. కాబట్టి వడ్డీ భారాన్ని తగ్గించుకోవాలి అనుకుంటే రెండేళ్లలోపే ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. లోన్ మార్చుకునే కొత్త బ్యాంకులో వడ్డీకి, పాత బ్యాంకులో వడ్డీకి కనీసం 1శాతం తేడా ఉండాలి. లేదంటే లోన్ ట్రాన్స్ ఫర్ ఛార్జీలు, ఇతర ఫీజులు లెక్కేసుకుంటే మీకు పెద్దగా లాభం జరగదు.
రెపో రేట్లు తగ్గించినప్పుడు..
ఆర్బీఐ బ్యాంకు రెపో రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు లోన్లపై వడ్డీని తగ్గిస్తాయి. అప్పుడు మీ ఈఎంఐ మొత్తంలో కొంచెం తగ్గుతుంది. అలా కాకుండా మీ ఈఎంఐను అలాగే ఉంచి లోన్ టెన్యూర్ ను తగ్గించమని బ్యాంకులను కోరండి. అప్పుడు మీరు లోన్ కట్టాల్సిన సమయం కంటే ముందే పూర్తి అవుతుంది.
అడిషనల్ పేమెంట్స్..
లోన్ ఈఎంఐ ఉన్నంతనే కడుతూ పోతే లోన్ త్వరగా తీరదు. కాబట్టి మీ ఆదాయం పెరిగినప్పుడో లేదంటే మీ జీతం పెరిగినప్పుడో ఆ డబ్బులను లోన్ ‘ప్రిన్సిపల్’ కింద కట్టేయండి. ఉదాహరణకు మీరు ఈఎంఐని ప్రతి నెల 1వ తేదీన కడుతున్నారనుకోండి. మీ దగ్గర ఈఎంఐ కంటే కొంత ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు.. అదే ఎఈంఐతో పాటు అడిషనల్ పేమెంట్ చేయండి. మీరు కట్టే అడిషనల్ పేమెంట్ ను అసలు కింద బ్యాంకులు కట్ చేసుకుంటాయి. అప్పుడు మీ లోన్ టెన్యూర్ తగ్గిపోతుంది. వడ్డీ భారం తగ్గి ఈఎంఐ కూడా తగ్గి తగ్గిపోతుంది. ఇలా అడిషనల్ పేమెంట్స్ ను ఏడాదిలో రెండు, మూడు సార్లు చేస్తూ వెళ్తే పదేళ్లలో కట్టే లోన్ ఆరు నుంచి ఏడేళ్లలో తీర్చేయొచ్చు.


