కలం, ఖమ్మం బ్యూరో : ఆన్లైన్‌లో ట్రేడింగ్ (Online Trading), ఇన్వెస్ట్మెంట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించిన రెండు వేర్వేరు కేసుల్లో ముగ్గురిని ఖమ్మం సైబర్ క్రైమ్ (Khammam Cyber Crime) పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన వ్యాపారం వేత్తకు ఫోన్ చేసి ఆన్లైన్‌లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. వాట్సప్ ద్వారా ట్రేడింగ్‌కు సంబంధించిన లింకులు పంపి సుమారు 30 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసేలా బలవంత పెట్టారు. ఈ కేసులో సైబర్ నిందుతులు మధు, రూప జాయింట్ అకౌంట్‌కి 7 లక్షలు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
మరో కేసులో ఖమ్మం (Khammam) జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇన్వెస్ట్మెంట్‌లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు సుమారు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయాడు. ఈ కేసులో నిందుతుడు సెంథిల్ కుమార్ అకౌంట్‌కి 25 వేల రూపాయలు వెళ్లినట్లు పేర్కొన్నారు. ముగ్గురు నిందుతులను బెంగుళూరులో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్
Follow Us On: X(Twitter)


