కలం, వెబ్ డెస్క్ : కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ కు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని.. ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ పేర్కొన్నారు. వాళ్ల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని లేదంటే పరువునష్టం దావా వేస్తానంటూ నోటీసుల్లో తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్, అర్వింద్ తనను నిందిస్తూ ఆరోపణలు చేశారని.. అవి తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎంపీ ధర్మపురి అర్వింద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అటు హైదరాబాద్ లో ఇటు నిజమాబాద్ లో నార్కొటిక్ సరఫరా పెంచాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Read Also: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదాలు.. ఎవరిదీ నిర్లక్ష్యం !
Follow Us On: Pinterest


