కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) మార్గనిర్దేశంలో పాలేరు (Paleru) నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తుందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి (Tumburu Dayakar Reddy) అన్నారు. శనివారం ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో తిరుమలాయపాలెం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. మొత్తం 109 మంది బాధితులకు రూ.38.70 లక్షల విలువైన చెక్కులను అందజేస్తూ పేదల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సాగు, తాగునీటిలో అగ్రగామి..
ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి (Tumburu Dayakar Reddy) మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవతో పాలేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించిన ప్రజలు, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే తీర్పును పునరావృతం చేయాలని కోరారు.
Read Also: అవి మతిలేని మాటలే : కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి
Follow Us On: Youtube


