కలం, మెదక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) విచారణ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీశ్ రావును ఈ కేసులో వరసగా విచారణకు పిలవడంతో ఆసక్తి నెలకొన్నది. ఈ ఇద్దరు విచారణకు హాజరయ్యారు. కాగా శనివారం కేటీఆర్, హరీశ్ రావు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)తో భేటీ అయ్యారు. దీంతో వీరు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మీదే అధినేతతో చర్చించినట్టు తెలుస్తోంది. సిట్ (SIT) అధికారులు ప్రశ్నించిన తీరును కేటీఆర్ అధినేతకు వివరించినట్టు సమాచారం. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎలా సాగుతోంది? భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతాయి? రానున్న మున్సిపల్ ఎన్నికల వ్యూహాలు ఏమిటి? అన్న అంశాలపై చర్చించినట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ విచారణ సందర్భంగా కేటీఆర్ (KTR), హరీశ్ రావు (Harish Rao) సమర్థవంతంగా వ్యవహరించారని కేసీఆర్ అన్నారని సమాచారం. విచారణ జరిగిన తీరు.. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడటం, విచారణ సందర్భంగా చేసిన జనసమీకరణ ఈ అంశాలన్నింటి మీద కేసీఆర్ చర్చించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ విచారణ అనంతరం పార్టీకి డ్యామేజ్ కాకుండా ఎలా వ్యవహరించాలో కేసీఆర్ (KCR)నేతలకు వివరించారని సమాచారం.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
అలాగే మున్సిపల్ ఎన్నికల అంశంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారని సమాచారం. బీఆర్ఎస్ పార్టీ మీద కక్షపూరితంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారనే విషయంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి అసమర్థ పాలన గురించి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నరని సమష్టిగా , సమన్వయంతో పనిచేస్తే మెజారిటీ మున్సిపల్ స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్.
Read Also: మున్సిపల్ ఎన్నికలకు ఇన్ చార్జులను నియమించిన బీఆర్ఎస్
Follow Us On: X(Twitter)


