కలం, వెబ్ డెస్క్: ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా ఎందరో యువకులు అక్రమమార్గాలను అనుసరించడం చూస్తుంటాం. ఆస్తులమ్మి కోట్ల రూపాయలు మోసపోయిన నిరుద్యోగులూ ఉంటారు. విదేశాల్లో ఉద్యోగాలు, విద్య పేరిట మోసపోయే విద్యార్థులను చూస్తుంటాం. కానీ ఈ కేసు కొంచెం డిఫరెంట్. ఓ విద్యార్థి (UP Student) ఎంబీబీఎస్ సీటు కోసం ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తన కాలును తానే నరుక్కొని వికలాంగ కోటాలో సీటు కోసం తెచ్చుకుందామని భావించి భంగపడ్డాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకున్నది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్‌పూర్‌కు చెందిన సూరజ్ భాస్కర్(24)కు (UP Student) ఎంబీబీఎస్ చదవాలన్నది కల. గత మూడేండ్లుగా ఇందుకోసం ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఈ సారి ఎలాగైనా సీటు సాధించాలని భావించాడు. కాలు నరుక్కుంటే దివ్యాంగుల కోటాలోనైనా సీటు దక్కుతుందేమోనని ఆశపడ్డాడు. చివరకు ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.
సూరజ్ జనవరి 18న తన మీద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కాలు నరికి పారిపోయారని కుటుంబసభ్యులకు చెప్పాడు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అతడు చెబుతున్న వివరాలతో పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా విచారించటంతో అసలు విషయం పడింది.
ప్రియురాలికి చెప్పి బుక్ అయ్యాడు?
తాను కాలు నరుక్కొని సీటు తెచ్చుకోబోతున్నట్టు ముందే తన ప్రేయసికి చెప్పాడు సూరజ్. పోలీసులు సూరజ్ కాల్ డాటా, అతడు డైరీలో రాసుకున్న వివరాల ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ప్రియురాలిని విచారించడంతో అసలు విషయం బయటపడింది. చివరకు సూరజ్ కూడా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దివ్యాంగుల కోటా సర్టిఫికెట్ కోసమే కాలు నరుక్కున్నాని చెప్పాడు. డీ-ఫార్మా డిగ్రీ చదువుతున్న సూరజ్.. అదే వైద్య పరిజ్ఞానంతో అనస్థీషియా వాడి తన కాలు తానే నరుక్కున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో అనస్థీషియా వైల్స్, సిరంజ్‌లు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. “2026లో ఎలాగైనా సరే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవాలి’ అని అతను డైరీలో స్పష్టంగా రాసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
Read Also: సిట్ విచారణపై కేసీఆర్‌తో చర్చించిన హరీశ్, కేటీఆర్!
Follow Us On: Instagram


