కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బలమైన రాజకీయ పార్టీగా జాగృతి ఎదగబోతోందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధికారంలోకి వస్తుందని అధ్యక్షురాలు కవిత (Kavitha) అన్నారు. ఆదివారం ఆమె బంజారాహిల్స్‌లో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ రద్దుపై స్పందిస్తూ.. హరీశ్ రావుపై (Harish Rao) షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావును గుంట నక్క అని, గుంటనక్కను చూసి గుడ్డిగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టాడని విమర్శించారు. గతంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడే సృజన్ రెడ్డికి కాంట్రాక్టులు అప్పజెప్పాడన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి బావమరిది అని గుర్తుకురాలేదా అని మండిపడ్డారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని మేం గమనిస్తున్నామని, కేటీఆర్ పై కథనం వస్తే ఒక నీతి? దళిత మహిళపై కథనం వస్తే ఒక నీతా? కవిత ప్రశ్నించారు.
‘‘మన రాష్ట్రంలో ఇప్పుడు దారుణమైన ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మోస్ట్ అన్ పాపులర్ యూట్యూబ్ ఛానెల్ లో కథనాలు వేసినట్లు శాటిలైట్ ఛానెన్‌లో కథనాలు వేస్తున్నారు. దళిత ఆడబిడ్డల మీద అలాంటి కథనాలు వేయటంపై మేం ఎంతో బాధపడ్డాం. గతంలో లైన్ అతిక్రమించిన యూట్యూబ్ ఛానెల్ వాళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి లైన్ అతిక్రమించిన శాటిలైట్ ఛానెల్ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసింది. జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరును మేం ఖండిస్తున్నాం. వాళ్లేమీ టెర్రరిస్టులు కాదు. వాళ్లకు నోటీసులు ఇచ్చి వివరణ అడగాల్సింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని బీఆర్ఎస్ (BRS) పార్టీ జర్నలిస్టులకు సపోర్ట్‌గా నిలిచింది. కానీ కేటీఆర్ మీద ఇలాంటే కథనాలే వస్తే ఆయన అనుచరులు ఒక ఛానెల్ పై దాడి చేశారు. అక్కడ మహిళపై కథనాలు వేస్తే దాడి…ఇక్కడ మహిళలపై కథనాలు వస్తే జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారా?‘‘ కవిత (Kavitha) ప్రశ్నించారు.
‘‘మహిళల విషయంలో ఇదేనా మీ వైఖరి అని నేను కేటీఆర్‌ను (KTR) ప్రశ్నిస్తున్నా. ఒక దళిత బిడ్డపై కథనాలు వస్తే ఆమెకు అండగా ఉండకపోవటాన్ని ప్రజలు గుర్తించాలి. ఆ ఛానెల్‌లో కథనం తర్వాత ఆ కథనం బ్యాక్ గ్రౌండ్ అంటూ ఇంకొక పేపర్‌లో కథనం వచ్చింది. ఆ కథనం ఆధారంగా భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టారు. భట్టి ప్రెస్ మీట్ పెట్టగానే మా గుంటనక్క కూడా ప్రెస్ మీట్ పెట్టారు. గుంటనక్క ప్రెస్ మీట్ ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడ విచిత్రాలు జరగుతున్నాయి’’ అని కవిత అన్నారు.
Read Also: మహేశ్‌కుమార్ గౌడ్‌కు కవిత ఆఫర్
Follow Us On: Sharechat


