కలం, తెలంగాణ బ్యూరో : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు (Mahesh Kumar Goud) తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని, తెలంగాణ జాగృతి అధికారంలోకి రావడం అంతకన్నా ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. ఓడిపోయే పార్టీలో ఉండేకన్నా అధికారంలోకి వచ్చే జాగృతిలోకి ఆయన వస్తే నేషనల్ కన్వీనర్ పోస్టు ఇస్తామని ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఇటీవల చిట్‌చాట్ సందర్భంగా చేసిన కామెంట్లను కవిత గుర్తుచేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన గురించి పలు అంశాలను ప్రస్తావించారు. “నేను కాంగ్రెస్‌లోకి కవిత రావడానికి ఆసక్తి చూపుతున్నానంట. కానీ ఆయనే రావద్దని బ్రేక్ వేశాడంట. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రెండు రోజుల క్రితం చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. నేను వీడియోగానీ, ఇతర వివరాలుగానీ ప్రత్యక్షంగా తెలుసుకోలేకపోయాను..” అని పేర్కొన్నారు.
“పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. అందుకే ప్రేమతో అన్నా అని పిలుస్తున్నా. జిల్లాల్లో అలాంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజానికి నేను కాంగ్రెస్‌లోకి వెళ్ళాలన్న ప్రతిపాదనా లేదు… ఆ అవసరం అంతకన్నా లేదు.. కాంగ్రెస్ ఓడపోయే పార్టీ… నెక్స్ట్ టైమ్ గెలిచే పార్టీ జాగృతి. నేనే రాజకీయ పార్టీ పెడుతున్నా… సీనియర్ పొలిటీషియన్‌గా ఆయన సేవలను జాగృతికి వాడుకుంటా.. సీరియస్ పార్టీగా నడిపిస్తా. తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించబోతున్నాం.. అందులో ఆయనకు నేషనల్ కన్వీనర్ పోస్టు ఇస్తా…” అని ఆమె (Kavitha) ఆఫర్ ఇచ్చారు.
Read Also: మీ ఆటలు సాగవు.. సీపీ సజ్జనార్ వార్నింగ్
Follow Us On: Sharechat


