కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని.. అందుకే టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) ఆవిర్భవించిందని కవిత (Kavitha) పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం బీఆర్ఎస్ పాలన బాగాలేదని కవిత పేర్కొన్నారు. ఆ ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం అయినందుకు ప్రజలను క్షమాపణ కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినా తెలంగాణ కలలు నిజం కాలేదని కవిత వ్యాఖ్యానించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో పార్టీని స్థాపించిన అనంతరం కవిత కీలకఉపన్యాసం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పులను దిద్దేందుకే తెలంగాణ రాష్ట్ర సేన జనం ముందుకు వచ్చిందని చెప్పారు. అన్ని వర్గాలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను కొత్త పార్టీని స్థాపించినట్టు చెప్పారు.
బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను కోల్పోయింది
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని కవిత (Kavitha) పేర్కొన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించిందని కవిత పేర్కొన్నారు. తాను మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు ఓ అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నానని చెప్పారు. ఓ అమ్మగా తాను ప్రజల కష్టాలను తీరుస్తానని కవిత చెప్పుకొచ్చారు. బిడ్డ కష్టాలు తల్లికి తెలిసినట్టే.. ఒక తల్లిగా తాను ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పారు. తాను ఒక తల్లిగా ఆలోచించి తెలంగాణ ప్రజలను సాదుకుంటానని భరోసా ఇచ్చారు.
Read Also: భారీగా లొంగిపోయిన ఛత్తీస్‌గడ్ మావోయిస్టులు
Follow Us On: Sharechat

