Mobile Popup Ad
Mobile Popup Ad

భారీగా లొంగిపోయిన ఛత్తీస్‌గడ్ మావోయిస్టులు

కలం, వెబ్ డెస్క్​ : ఛత్తిస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన 47 మంది మావోయిస్టులు (Chhattisgarh Maoists) శనివారం పోలీసుల ముందు లొంగిపోయారు. గత కొంతకాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస కార్యక్రమాలకు ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వారు నిర్ణయించుకున్నారు.

లొంగిపోయిన వారిలో కీలక నేతలతో పాటు దళ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం. వీరు తమ వెంట తెచ్చిన 34 అత్యాధునిక ఆయుధాలను పోలీసులకు అప్పగించి సరెండర్ అయ్యారు. కాగా, లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను, వారి నేపథ్యాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి నేడు మీడియా ముందు వెల్లడించనున్నారు. ఈ మేరకు పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన లొంగుబాటు పాలసీ ప్రకారం వీరికి అందాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>