కలం, వెబ్ డెస్క్: కర్ణాటక (Karnataka)లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ ప్రియుడితో వెళ్లిపోవడంతో ఆమె భర్త పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకాలోని ఆల్కెరె గ్రామంలో చోటు చేసుకుంది. శివణ్ణ అనే వ్యక్తి గ్రామంలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఇతడికి భార్య కావ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కావ్యకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో కావ్య వారం రోజుల క్రితం అతడితో వెళ్లిపోయింది. దీంతో శివణ్ణ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కావ్య వారం తర్వాత మళ్లీ వచ్చి ఇంట్లో నుంచి లక్షలాది రూపాయలు, బంగారు ఆభరణాలు తీసుకొని మళ్లీ వెళ్లిపోయింది.
కావ్య చేసిన పనికి అవమానంతో శివణ్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ముందే తన ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. భార్య పిల్లలతో సంతోషంగా సాగుతున్న శివణ్ణ జీవితంలో భార్య అక్రమ సంబంధం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కావ్య, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.
Read Also: ఫస్ట్ ఇంప్రెషన్‌ను పాడుచేసే అలవాట్లు ఏంటో తెలుసా?
Follow Us On: X(Twitter)

