కలం, నల్గొండ బ్యూరో: జిల్లాలోని మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం (Venkatadripalem)లోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సబ్ స్టేషన్ ప్రాంగణమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సబ్ స్టేషన్‌లోని ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అకస్మాత్తుగా మంటలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే మంటలు ఇతర పరికరాలకు వేగంగా విస్తరించాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ప్రమాదం ఎలా సంభవించిందనే విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాంకేతిక లోపం వల్ల ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమా..? లేక ఎండ తీవ్రత వల్ల ఆయిల్ వేడెక్కి మంటలు వ్యాపించి ఉండవచ్చా..? అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన వల్ల విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!
Follow Us On: X(Twitter)

